Pooja Hegde: ‘కాంతార’ గురించి బుట్ట బొమ్మ ఏమందంటే?

‘కాంతార’ సినిమా గురించి మాట్లాడితే చాలు.. చాలా మంది గూస్‌ బంప్స్‌ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊపు అలాంటిది. ఆ సన్నివేశాలు, నేపథ్య సంగీతం.. అన్నీ కలగలిపి సినిమా ప్రేక్షకుణ్ని వేరే లోకంలో కి తీసుకెళ్తాయి అని చెబుతున్నారు సినిమా చూసినవాళ్లు. ఈ మాటలు కేవలం సగటు ప్రేక్షకులే కాదు.. సినిమా సెలబ్రిటీలు కూడా అంటున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే మాట చెప్పుకొచ్చింది. ‘కాంతార’ సినిమా చూసిన ఆమె తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. దాంతోపాటు సినిమాలు ఎలా ఉంటే బాగుంటాయో కూడా తన ఆలోచన చెప్పింది.

మీకు తెలిసిన విషయాన్నే కథ రాయండి. మీ మనసుకు చేరువైన, మనసులో నుండి వచ్చిన కథలనే చెప్పండి అంటూ ‘కాంతార’ సినిమా గురించి తన వ్యూ చెప్పింది పూజ. ‘కాంతార’ చిత్రంలోని చివరి 20 నిమిషాలు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటూ తన ఎగ్జైట్‌మెంట్‌ను కూడా చెప్పుకొచ్చింది. ఆ విజువల్స్‌, నటుల నటనకు చలించిపోయాను అని కూడా అంది. తన చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించారు అంటూ పొగిడేసింది పూజ.

రిషబ్‌ శెట్టి.. నువ్వు అద్భుతం నటించి, నటింపజేపసి భారీ హిట్‌ అందుకున్నావు. రానున్న రోజుల్లో మరెన్నో ప్రశంసలు అందుకోవాలి అని పూజ తన ఆనందాన్ని తెలిపింది. కర్ణాటక, కేరళ ప్రాంతంలో తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ‘కాంతార’ సినిమాను రూపొందించారు. స్థానిక గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని ఆధారంగా చేసుకుని ప్రకృతికి మనుషులకు మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఈ సినిమాలో చూపించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా ఏదో చిన్న సినిమాగా విడుదలైన ‘కాంతార’ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ వసూళ్లు మరింత భారీగా మారుతాయి అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus