మొదట్లోనే ‘డీజే దువ్వాడ జగన్నాథం’తో (Duvvada Jagannadham) టాప్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించిన పూజా (Pooja Hegde) , ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) వరకు వరుస హిట్స్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచింది. అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ఆమె నటన, స్టైల్ ఆకట్టుకున్నాయి. కానీ, ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ (Radhe Shyam), ‘బీస్ట్’ (Beast), ‘ఆచార్య’(Acharya), బాలీవుడ్‌లో ‘సర్కస్’ (Cirkus), ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan), ‘దేవ’ (Deva) వంటి సినిమాలతో వరుస ఫ్లాపులు ఆమె క్రేజ్ ను తగ్గించాయి. తాజాగా సూర్యతో (Suriya) ‘రెట్రో’ (Retro) కూడా ఫ్లాప్ కావడంతో పూజా కెరీర్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి.
‘రెట్రో’ ఫ్లాప్‌తో పూజా హెగ్డే ఖాతాలో ఏడు వరుస ఫ్లాపులు చేరాయి, ఇది ఆమె కెరీర్‌కు పెద్ద దెబ్బగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమెకు అవకాశాలు తగ్గుతాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూజా కెరీర్‌ను గట్టెక్కించే ఆశలు ఇద్దరు హీరోలపై ఉన్నాయి.. దళపతి విజయ్, రాఘవ లారెన్స్. విజయ్‌తో ‘జన నాయగన్’లో (Jana Nayagan) నటిస్తున్న పూజా, ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ చివరి చిత్రంగా చెబుతున్నారు.
2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అయితే పూజా కెరీర్‌కు కొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉంది. ‘జన నాయగన్’ తర్వాత పూజా హెగ్డే రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’లో నటించనుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ ‘కాంచన’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోంది. పూజా జీవితంలో తొలి హర్రర్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది. ‘కాంచన’ సీరీస్‌కు ఉన్న క్రేజ్, లారెన్స్ దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా కూడా పూజాకు కీలకంగా మారింది.
ఈ రెండు సినిమాలు హిట్ అయితే పూజాకు మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే కెరీర్ ముగిసినట్లేనని ఇండస్ట్రీ టాక్. పూజా హెగ్డే వరుస ఫ్లాపులకు కారణం ఆమె ఎంచుకున్న సినిమాలేనని విమర్శలు వస్తున్నాయి. ‘రాధేశ్యామ్’ నుంచి ‘రెట్రో’ వరకు ఆమె పాత్రలకు స్కోప్ లేకపోవడం, కథలు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోవడం ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్(Vijay Thalapathy) , లారెన్స్(Raghava Lawrence) సినిమాలు ఆమె కెరీర్‌ను గాడిలో పెట్టే అవకాశం ఉన్నాయి. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఫలితాలు ఏ విదంగా ఉంటాయో చూడాలి.