SSMB28: ‘ఎస్.ఎస్.ఎం.బి 28’ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాలిడే ట్రిప్ నిమిత్తం తన భార్య పిల్లలతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మహేష్ విదేశాల్లోనే ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటాడు. ఇదిలా ఉండగా.. మహేష్… త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే మూవీ గురించి చాలా రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ కు ఈ స్క్రిప్ట్ నచ్చక షూటింగ్ ను ఆగస్టులో ప్రారంభిస్తాడని..

హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ప్రియాంక అరుల్ మోహన్ ను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తల పై క్లారిటీ వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం జూలై రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. జెర్మనీలో ఇటీవల మహేష్.. త్రివిక్రమ్ ను కలుసుకుని స్క్రిప్ట్ లాక్ చేసినట్టు కూడా వినికిడి. అలాగే ఈ చిత్రం నుండీ పూజా హెగ్డే తప్పుకుంది అనే ప్రచారం కూడా అవాస్తవమని తెలుస్తుంది.

ఈ చిత్రం కోసం పూజ డేట్స్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని తెలుస్తుంది. సంగీత దర్శకుడు తమన్ తో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడం కూడా జరిగిపోయాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మహేష్- త్రివిక్రమ్ ల మూవీని 4 నెలల్లో పూర్తి చేసి 2023 సంక్రాంతికి విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు), నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus