Pooja Hegde, Kantara: కాంతార సినిమాపై పూజా హెగ్డే అలా అన్నారా?

  • October 25, 2022 / 04:09 PM IST

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కాంతార సినిమా గురించి స్పందించి ఆ సినిమా గురించి పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చారనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కాంతార 188 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. కాంతార సినిమా గురించి పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మీకు ఏం తెలుసో దానినే కథగా రాయాలని చెప్పుకొచ్చారు.

మీ హృదయానికి చేరువైన మనసు నుంచి వచ్చిన కథలను మాత్రమే చెప్పాలని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. కాంతార సినిమాలోని చివరి 20 నిమిషాల సీన్లను చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. ఈ సినిమాలో నటీనటులు ప్రదర్శన, విజువల్స్ ను చూసి ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. కాంతార సినిమాకు విశేషమైన ఆదరణ దక్కినందుకు గర్వంగా ఉందని ఆమె తెలిపారు. బాల్యంలో చూసిన భూతకోలని అద్భుతంగా చూపించి రిషబ్ శెట్టి హిట్ అందుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలను అందుకోవాలని కోరుకుంటున్నానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. తుళునాడు ఆచారాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

మరోవైపు పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో పూజా హెగ్డే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూజా హెగ్డే కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus