పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈమెకు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుండీ కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట.
దాంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచేసిందని వినికిడి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ యంగ్ హీరో సినిమాని రిజెక్ట్ చేసిందట. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని ఇప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసేసారు. లాక్ డౌన్ సీజన్లో.. మరింత ఎక్కువగా చూసేస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని మార్పులతో పాటు పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే.. ‘అందాదున్’ రీమేక్ పై హైప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే పూజా హెగ్డే ను సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట. అయితే పారితోషికం తక్కువ చెప్పడం వల్లనే పూజా హెగ్డే నో చెప్పినట్టు వార్తలు వస్తుండడం గమనార్హం.