సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్‌కి ఎంత ప్రాధాన్యత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇవి కేవలం ఎంటర్టైన్‌మెంట్ కోసం మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే, ఒక సినిమా హైప్ కోసం ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేయడమే కాదు, అందులో ఎవరు నటిస్తారన్న దానిపై కూడా ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ కూలీలో (Coolie) ఐటెం సాంగ్ చేయడానికి పూజా హెగ్డేకి (Pooja Hegde) అవకాశం దక్కింది. రజనీకాంత్ (Rajinikanth) , లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమాపై సౌత్ లో ఎంత క్రేజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి పూజా హెగ్డేను (Pooja Hegde) తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ సమాచారం ప్రకారం, ఈ సాంగ్ కోసం ఆమెకి ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం ఆఫర్ చేసిందట సన్ పిక్చర్స్. అంతేకాదు, ట్రావెల్ ఖర్చులు, స్టాఫ్ ఖర్చులు ఇలా అన్నింటిని కలిపి రూ.2.10 కోట్లు ఆమెకి అందజేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, గత కొన్ని ఏళ్లుగా పూజా హెగ్డే కెరీర్ పరంగా కాస్త నెమ్మదిగా నడుస్తోంది. మహర్షి, అలా వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) వంటి సూపర్ హిట్ల తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
రాధే శ్యామ్ (Radhe Shyam), ఆచార్య వంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన సర్కస్, దేవా (Deva) కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో కొత్త సినిమాలు దక్కడం కష్టం అనిపించింది. ఇలాంటి టైమ్‌లోనే పూజా హెగ్డే కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో రెట్రో (Retro) , జననాయకన్ (Jana Nayagan) వంటి సినిమాల్లో నటిస్తోంది. పైగా, కూలీ సినిమాలో ఈ ఐటెం సాంగ్ హిట్ అయితే కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది.
రజనీకాంత్ మూవీ కావడంతో ఇది పాన్ ఇండియా రేంజ్‌లో ప్రచారం పొందే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో, ఈ బ్యాడ్ టైమ్‌లో పూజా హెగ్డే అంత పారితోషికం డిమాండ్ చేయడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, సినిమా బిజినెస్‌లో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు హై డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చినా తప్పులేదు.. అంటూ కొందరు వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా, కూలీలో ఈ సాంగ్ హిట్ అయితే పూజా (Pooja Hegde) కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.