మేజర్ గురించి మాట్లాడమంటే.. ఇప్పుడెందుకు అనేసింది!

ఒకప్పుడు అందరిచేత అయిరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస విజయాలతో గోల్డెన్ లేడీ అయిపోయింది. టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ ఆమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అటువంటి పూజా హెగ్డే తన రెమ్యూనరేషన్ పెంచడం అనేది సర్వసాధారణం. ఎంతైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. అయితే.. ఈ పద్ధతి అందరి దగ్గరా వర్కవుట్ అవ్వదు. నమ్రత లాంటి పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ దగ్గర ఇలాంటి టెక్కులు అస్సలు వర్కవుట్ అవ్వవు. దాంతో.. “మేజర్” సినిమాలో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది పూజా హెగ్డే.

ఇదే విషయమై నిన్న “అల వైకుంఠపురములో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూజా హెగ్డేను.. “నమ్రత ఇచ్చిన ఆఫర్ కు మరీ ఎక్కువ రెమ్యూనరేషన్ కోట్ చేశారంట కదా?” అని ప్రశ్నించగా.. పూజా హెగ్డే చాలా సింపుల్ గా “అల వైకుంఠపురములో” సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం” అని రిప్లై ఇచ్చి సినిమా గురించి తప్ప దేని గురించీ సమాధానం చెప్పనని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. మరి పూజా హెగ్డే ఈ ప్రశ్నను ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ.. ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పక తప్పదు. అప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus