పూజాహెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అంద చందాలతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అదిలా ఉంటే తాజాగా ఈమె ఆస్తి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఆమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని, కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఇక ఈమెకు(Pooja Hegde) మొత్తంగా రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు. పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో సెటిల్ అయ్యారు.
తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా పుట్టింది ముంబై అయిన తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు. అలాగే ముంబై, హైదరాబాద్ నగరాల్లో పూజా హెగ్డే కొన్ని ఫ్లాట్స్ ను కొనుగోలు చేసింది. పూజా హెడ్డే తండ్రి మంజునాధ్ హెగ్డే బడా వ్యాపార వేత్త. అలాగే తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న మెళుకువలతో పూజా హెగ్డే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది.
మొత్తంగా పూజా హెగ్డే (Pooja Hegde) ఆస్తుల విలువ రూ. 60 కోట్లు ఉంటుందని పలు నివేధికలు చెబుతున్నాయి. పూజా హెగ్డే తన మొదటి సినిమా “మాస్క్ “కోసం 30 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు