సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్, లైఫ్‌స్టైల్, ఆదాయ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 2012లో తమిళ సినిమా ముగమూడితో తెరంగేట్రం చేసిన పూజా, అతి తక్కువ సమయంలోనే తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీఆర్ (Jr NTR) , మహేష్ (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), దళపతి విజయ్ (Vijay Thalapath) లాంటి అగ్రహీరోల సరసన నటించడమే కాకుండా, బాలీవుడ్‌లో సల్మాన్ (Salman Khan), హృతిక్ (Hrithik Roshan) లాంటి స్టార్స్‌తో కలిసి సినిమాలు చేసింది.
స్టార్డమ్ పెరుగుతూనే ఉన్న పూజా.. తన సంపాదనను లగ్జరీ హౌస్‌లు, కార్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్‌లో పెట్టుబడి పెట్టడం గమనార్హం. ఆమె సినిమాల నుంచి మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ ద్వారా భారీగా సంపాదిస్తోంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే ఆదాయం 12 ఏళ్లలో రేంజ్ లో పెరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. పూజా ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3.5 – 4.5 కోట్ల పారితోషికం అందుకుంటోంది. బీస్ట్ (Beast) తర్వాత పారితోషికాన్ని ఎక్కువగా పెంచిందని టాక్.
అలాగే, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె భారీగా ఆదాయం పొందుతోంది. ఓ అప్‌డేట్ ప్రకారం, ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కి పూజా 40 లక్షలు తీసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 27.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బు అర్జిస్తోంది. ప్రస్తుతం ఆమె నెలవారీ ఆదాయం 50 లక్షలు ఉంటుందని సమాచారం. తన సంపాదనలో అధిక శాతం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన పూజా, ఇప్పటికే ముంబై బాంద్రాలో 6 కోట్ల విలువైన 3BHK సీఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది.
ఇటీవల 45 కోట్ల విలువైన 4000 స్క్వేర్ ఫీట్ విలాసవంతమైన ఇల్లు కూడా ముంబైలో కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా 4 కోట్ల విలువైన విల్లా ఉంది. ఇక పూజా హెగ్డే ఖరీదైన కార్ల ప్రేమికురాలు. ఆమె వద్ద ₹60 లక్షల విలువైన జగ్వార్, 2 కోట్ల విలువైన పోర్షే కయెన్, 80 లక్షల విలువైన ఆడి క్యూ7 ఉన్నాయి. 2023లో 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కూడా తన గ్యారేజీలో చేరింది. ఇక లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్ అంటే పూజాకు ప్రత్యేకమైన ఆసక్తి. లూయిస్ విట్టన్, క్రిస్టియన్ డియోర్, ఎల్‌వీ వంటి బ్రాండ్‌ల బ్యాగులను కొనుగోలు చేసింది.
వీటి ధర ఒక్కొక్కటి రూ.1.3 లక్షల నుంచి 1.9 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైగా ఉంది. సినిమాలు, కమర్షియల్స్, స్పెషల్ ఈవెంట్స్, బ్రాండ్ డీల్స్ కలిపి ఆమె ఆదాయం ఏటా పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్, సౌత్ పరిశ్రమల్లో టాప్ లెవల్‌లో కొనసాగుతున్న ఆమె, లైఫ్‌స్టైల్ పరంగా కూడా స్టార్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. అయితే వరుస ఫ్లాపుల తర్వాత పూజా తిరిగి క్రేజ్ సంపాదించేందుకు కాస్త సమయం పడుతుందనే టాక్.