Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ని ఉద్దేశించి సైకో అంటూ పలకడం. ఆ తర్వాత 2022 లో టికెట్ హైకులు కోసం చిరంజీవి (Chiranjeevi) టాలీవుడ్ కు చెందిన కొందరు నిర్మాతలు, స్టార్ హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్..లను వెంట బెట్టుకుని వెళ్లి వై.ఎస్.జగన్ ను కలవడం.

Poonam Kaur

ఆ టైంలో హీరోలతో జగన్ బ్రతిమిలాడించుకోవడం.. ముఖ్యంగా చిరంజీవితో నమస్కారం పెట్టించుకోవడం, అంతేకాకుండా జగన్ ను కలిసేందుకు వెళ్లిన టైంలో హీరోలు వస్తున్న కార్లను గేట్ బయటే ఆపేసి నడిచేలా చేయడం వంటి అంశాలను బాలకృష్ణ గుర్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో లిస్ట్ లో నా పేరుని 9 వ ప్లేసులో పెట్టారంటూ బాలకృష్ణ.. పరోక్షంగా చురకలు కూడా అంటించారు.

దీనిపై చిరంజీవి స్పందించి బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో చిరంజీవి అభిమానులు బాలకృష్ణ పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పూనమ్ కౌర్ బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ చంటి పిల్లాడి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ప్రతి ఒక్కరి ఉద్దేశాలను దేవుడు టైం వచ్చినప్పుడు బయటపెడతాడు’ అంటూ పూనమ్ రాసుకొచ్చింది.

ఆమె కామెంట్స్ పై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘ అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి.. కడుపైనా చేసేయాలి’ అంటూ పలికే వాడు చిన్నపిల్లాడా? ‘ అంటూ బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్స్ ను ఆధారం చేసుకొని పూనమ్ పై మండి పడుతున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus