Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » తనికెళ్ల భరణిపై గౌరవంతో… పూనమ్ కౌర్ కవిత

తనికెళ్ల భరణిపై గౌరవంతో… పూనమ్ కౌర్ కవిత

  • April 15, 2020 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనికెళ్ల భరణిపై గౌరవంతో… పూనమ్ కౌర్ కవిత

తనికెళ్ల భరణి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనో రచయిత, నటుడు. అలాగే, ఆయనొక ఆధ్యాత్మిక సాహితీ వేత్త. శివతత్వాన్ని అవపోసన పట్టిన భక్త. తెలుగుతెర తోట రాముడు తనికెళ్ల భరణి. ‘మిథునం’లో అప్ప దాసు, బుచ్చి లక్ష్మి పాత్రలకు ప్రాణం పోసిన దర్శక సృష్టి. రచయితగా, దర్శకుడిగా విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన ఆయన, నటుడిగా వచ్చిన అవకాశాలకు అంతే అందంగా జీవం పోశారు. తెరపై పాత్రలు తగ్గట్టు విలక్షణ, వైవిధ్యమైన నటన కనబర్చిన తనికెళ్ల భరణి, తెర తీసిన తర్వాత నిజజీవితంలో నటన అనే కళను అవపోసన పట్టలేకపోయారు.

తనికెళ్ల భరణి ఒక మాట రాసినా, తెరపై నటుడిగా ఒక మాట చెప్పినా… గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు పద్దతిగా ఉంటుంది. ఆయన గురించి అంతే పద్దతిగా, చక్కగా నటి పూనమ్ కౌర్ ఒక కవిత రాశారు. తనికెళ్ల భరణి జీవితంలో పూనమ్ కౌర్ పరకాయ ప్రవేశం చేసినట్టు, ఆయన ఆత్మ ఆమెను ఆవహించినట్టు…. రాశారంటే అతిశయోక్తి కాదు.

Poonam Kaur pens a poem out of respect towards Tanikella Bharani1

పూనమ్ కౌర్ మాట్లాడూతూ “భరణి గారికి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చాట్ నిర్వహించాను. నా తరపున ఆయనకు ఈ కవిత వినిపించా. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత” అని అన్నారు.

పూనమ్ కౌర్ రాసిన కవిత:
ఔను….
నేను నటుడినే.
కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.
ఔను …
నేను ఒక కళాకారుడినే.
కానీ, కళామతల్లి మీద
ప్రేమ, అభిమానంతో,
కళ విలువ తెలియకుండా
నా దగ్గరకి వచ్చే
ప్రతి మనిషికి నేను
నా కళని అమ్ముకోలేకపోయాను.
సాహిత్యం పట్ల ప్రేమతో,
మన భారత దేశంలో ఉన్న
సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని
ఒక చిన్న ఆశ.
ఆ భావంతో,
మనసు నిండా అదే ఆలోచనతో
నేను నా ప్రతి నాటకం రాశా.
డబ్బు గురించి మాట్లాడితే
అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.
అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో,
కరుణతో, మర్యాదతో వచ్చినపుడు
శిరసు వంచి అందుకున్నాను.
నా దగ్గరకి వచ్చిన మనిషి
అహంభావం చూపించినా,
నేను ప్రేమతోనే చూశాను.
కానీ,
నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం
ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.
వెనకడుగు వేసే ప్రతి నిమిషం
కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.
కానీ నా స్వార్ధం కోసం
నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే
కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.
పూజ చేశాక,
మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో
నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.
నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను
అని మా ఆవిడ అంటే,
నీ సహాయం లేకుండా
ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.
పిల్లలందరిని నేను కోరుకునేది ఒకటే.
అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి.
నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి.
ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని
నేను…..
మీ
తనికెళ్ళ భరణి

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tanikella Bharani
  • #Actress Poonam Kaur
  • #Poonam Kaur
  • #tanikella bharani

Also Read

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నిలకడగా రాణిస్తుంది కానీ

Anaganaga Oka Raju Collections: 8వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

related news

Tollywood: హీరోయిన్ల ఇష్యూ.. మొదటిసారి కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్

Kollywood: 90స్ లవర్ బాయ్ సెకండ్ ఇన్నింగ్స్.. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా..

Miya Khalifa: మిస్టర్ బీన్‌తో డేటింగ్? రూమర్లపై మియా ఖలీఫా సెటైరికల్ క్లారిటీ!

Miya Khalifa: మిస్టర్ బీన్‌తో డేటింగ్? రూమర్లపై మియా ఖలీఫా సెటైరికల్ క్లారిటీ!

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Yellamma : గుడ్ మార్నింగ్ అంటూ ఫోటో షేర్ చేసి.. కొత్త చిక్కుల్లో పడ్డ బలగం వేణు

Yellamma : గుడ్ మార్నింగ్ అంటూ ఫోటో షేర్ చేసి.. కొత్త చిక్కుల్లో పడ్డ బలగం వేణు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

trending news

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

32 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

3 hours ago
Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

Cheekatilo Review in Telugu: చీకటిలో సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

19 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నిలకడగా రాణిస్తుంది కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నిలకడగా రాణిస్తుంది కానీ

19 hours ago

latest news

Nikhil : నిఖిల్ ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యేలా లేదుగా..!

Nikhil : నిఖిల్ ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యేలా లేదుగా..!

3 hours ago
Oscars 2026: ఆస్కార్‌ 2026 నామినేషన్స్‌ లిస్ట్‌ వచ్చేసింది.. ‘సిన్నర్స్‌’ రికార్డు

5 hours ago
Anil Ravipudi: అన్నీ చెప్పి అసలు విషయం దాస్తున్న అనిల్‌ రావిపూడి.. మొత్తం సెట్‌!

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version