ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చిన పూనమ్ కౌర్.. !

పూనమ్ కౌర్.. ఈమె సినిమాలతో కన్నా… సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘మాయాజాలం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన పూనమ్ అటు తర్వాత ‘ఒక వి చిత్రం’ ‘వినాయకుడు’ ‘గగనం’ ‘నాగవల్లి’ ‘శౌర్యం’ ‘నెక్స్ట్ ఏంటి’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాల్లో నటించింది కానీ… మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. దాదాపు ఈమెను అందరూ మర్చిపోయారు… అనుకున్న టైములో ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ …

తను పవన్ ఫ్యాన్స్ తో ఫైట్ చేస్తున్న సమయంలో … పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ కు ఎఫైర్ ఉన్నట్టు.. ఆరోపణలు చేసి సంచలనం రేపాడు. ఆ టైములో పూనమ్ ఏమాత్రం స్పందించ లేదు. పైగా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ వచ్చింది. అందుకు పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వాళ్ళు కూడా ఈమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. అలా అని ఈమె తగ్గలేదు. ‘జల్సా’ సినిమాలో పవన్, త్రివిక్రమ్ లు… పూనమ్ కౌర్ కు ఒక రోల్ ఇస్తామని మోసం చేసారు…

అందుకే ఆమె ఇలా పవన్ కళ్యాణ్ పైన అలాగే జనసేన పార్టీ పైన ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తుంది అనే రూమర్ ఉంది. దానికి ఇన్నాళ్ళకు క్లారిటీ ఇచ్చింది పూనమ్ కౌర్. మే 4 సోమవారం నాడు(నిన్న) దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్బంగా … పూనమ్ మాట్లాడుతూ…” ‘జల్సా’ సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు’ అని అప్సెట్ అయ్యాను అంటూ ఎన్నికల టైములో రూమర్స్ వచ్చాయి. అవన్నీ అసత్యాలు. నేను ఒక్క దాసరి గారి డైరెక్షన్లో నటించలేకపోయానే అని మాత్రమే ఇప్పటికీ బాద పడతాను. అంతే తప్ప మరేమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus