Poonam Kaur, Trivikram: డైరెక్టర్ త్రివిక్రమ్ పై సెటైర్స్ వేసిన పూనమ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇదివరకు అతడు ఖలేజా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం సినిమా రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా కాపీ అంటూ తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. గుంటూరు కారం ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమా యుద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు పై నటి పూనమ్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి తాను చేసిన తప్పుడు పనులు ప్రజలకు తెలియకుండా చేయగల నైపుణ్యం ఆయనకు ఉంది. కొంతమంది ఆయనను గుడ్డిగా నమ్ముతూ ఉంటారు గత ప్రభుత్వం ప్రజలకు ఏ విషయంలోనూ సహాయం చేయలేదు కానీ ఆయనకు సహాయం చేయడంలో మాత్రం ముందుంటుంది

అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటూ ఈ సందర్భంగా (Poonam Kaur) పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మాత్రమే కాకుండా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా కామెంట్లు చేశారని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus