Poonam Kaur: ఆ వార్తలన్నీ కట్టుకథలు.. హీరోయిన్ పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నటీమణులలో (Poonam Kaur) పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) టార్గెట్ గా కొన్ని సందర్భాల్లో పోస్ట్ లు పెట్టగా ఆ పోస్టులు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పూనమ్ కౌర్ కు జల్సా (Jalsa) సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారని జోరుగా ప్రచారం జరగడం గమనార్హం. ఈ ప్రచారం గురించిన తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ ద్వారా పూనమ్ కౌర్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె పేర్కొన్నారు. జల్సా మూవీ నుంచి నన్ను తప్పించారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం కట్టుకథ అని ఆమె అన్నారు. నిజం కాని విషయాలను నిజమని నమ్మించేలా ఆ కట్టుకథను ప్రచారంలోకి తెచ్చారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. నేను ఏ నటుడిని దర్శకుడిని సినిమాలో ఛాన్స్ కావాలని నా జీవిత కాలంలో అడగలేదని ఆమె వెల్లడించారు.

నేను నటించిన సినిమాలతో పోల్చి చూస్తే రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువని వైరల్ అయిన వార్తలను నమ్మవద్దని ఆమె కోరారు. నేను మూవీ ఆఫర్లు లేకపోతే ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతానని పూనమ్ వెల్లడించారు. జల్సా మూవీ ఆఫర్ వార్తలకు ఆమె ఈ విధంగా చెక్ పెట్టారు. పూనమ్ కౌర్ గీతాంజలి మృతి గురించి కూడా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక పార్టీకి సపోర్ట్ గా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పూనమ్ కౌర్ భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. పూనమ్ కౌర్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus