Poonam Kaur, Prakash Raj: పూనమ్ కౌర్ వాళ్లకు షాక్ ఇవ్వబోతుందా?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన పూనమ్ కౌర్ కు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే. తాజాగా పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ గెలిస్తే మాత్రమే తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టగలనని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరని పూనమ్ కౌర్ కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రకాష్ రాజ్ కు పెద్దల పట్ల గౌరవం ఉందని ఇచ్చిన మాటకు ప్రకాష్ రాజ్ కట్టుబడి ఉంటారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. ఆ రీజన్ వల్లే ప్రకాష్ రాజ్ కు తాను మద్దతు ఇస్తానని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. గత కొన్నిరోజులుగా పోసాని చేసిన కామెంట్ల వల్ల పూనమ్ కౌర్ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పోసాని చెప్పిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ అని చాలామంది భావిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి పూనమ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తరువాత స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పూనమ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరగనుండగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండనుందని తెలుస్తోంది. పూనమ్ కౌర్ నోరు విప్పితే కొంతమంది సెలబ్రిటీలకు షాక్ తప్పదని తెలుస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus