Poonam Kaur: సోషల్ మీడియాలో కాక రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్.. ఏమన్నారంటే?

2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉండగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు కచ్చితంగా ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీ ప్లస్ పాయింట్లు ఆ పార్టీకి ఉండగా ఏ పార్టీ నెగిటివ్ పాయింట్లు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. హ్యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం గమనార్హం.

మహిళా రెజ్లర్ల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ ఈ కామెంట్లు చేశారు. కొంతమంది స్త్రీల సమస్యల విషయంలో ఎంతో శ్రద్ధ ఉందనే విధంగా గొంతు చించుకుని అరుస్తున్నారని వీళ్లు మహిళా రెజ్లర్ల సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. సౌకర్యాలు, స్వలాభం ముఖ్యమని భావించే నాయకుల విషయంలో ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

పూనమ్ కౌర్ (Poonam Kaur) ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడంతో ఈ ట్వీట్ విషయంలో ఎవరిని టార్గెట్ చేశారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. అదే సమయంలో కొంతమంది మాత్రం రివర్స్ లో పూనమ్ కౌర్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఏం ట్వీట్ చేసినా క్షణాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరోవైపు పూనమ్ కౌర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. పూనమ్ కౌర్ అడపాదడపా సినిమాలలో నటిస్తుండగా ఆమె పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెడితే ఆమె రేంజ్ మరింత పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus