Captain Movie: ఈ డబ్బింగ్ సినిమాకి ప్రమోషన్స్ చేయరా..?

ఈ శుక్రవారం నాడు కొన్ని కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటికంటే ఒకరోజు ముందుగానే ‘కెప్టెన్’ సినిమా రిలీజ్ కానుంది. ‘నేనే అంబానీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ఆర్య.. ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించి మరింత అలరించారు. ఇప్పుడు ఆయన నటించిన ‘కెప్టెన్’ సినిమా సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేవు. ట్రైలర్ అయితే థ్రిల్లింగ్ గానే ఉంది. కానీ ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాపై బజ్ రావడం లేదు.

దీంతో ఓపెనింగ్స్ వచ్చేలా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. సినిమా కాన్సెప్ట్ చూస్తుంటే.. హాలీవుడ్ లో తెరకెక్కిన ‘ప్రిడేటర్’ సినిమాకి దగ్గరగా అనిపిస్తుంది. ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండియాలో కూడా రిలీజై సూపర్ హిట్ అయింది. అడివిలో తిరిగే ఓ వింతజీవి అక్కడకు వచ్చినవాళ్లను దారుణంగా చంపుతూ ఉంటుంది. దాన్ని చంపడానికి చేసే ప్రయత్నాలన్నీ వృథా అవుతుంటాయి. ఫైనల్ గా హీరో తన టెక్నిక్స్ తో ఆ జీవిని అంతం చేస్తాడు.

దీన్నే మన నేటివిటీకు తగ్గట్లుగా ‘కెప్టెన్’ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్నాళ్లక్రితం ఆర్య హీరోగా ‘టెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించారాయన. అంతకముందు జాంబీ కాన్సెప్ట్ తో ‘యమపాశం’, స్పేస్ షిప్ బ్యాక్ర్ డ్రాప్ లో ‘టిక్ టిక్ టిక్’ లాంటి సినిమాలను రూపొందించారు.

అవన్నీ కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. దర్శకుడిగా ఆయన క్రియేటివిటీకి మంచి మార్కులు పడ్డాయి. ఎంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ అయినా.. ప్రమోషన్స్ లేనప్పుడు సినిమా జనాలకు రీచ్ అవ్వదు. పైగా వేరే భాషలో రిలీజ్ అంటే కనీసపు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ‘కెప్టెన్’ విషయంలో అలా జరగడం లేదు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus