Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమాలకు టైటిల్ అయిన పాపులర్ సాంగ్స్

సినిమాలకు టైటిల్ అయిన పాపులర్ సాంగ్స్

  • April 28, 2018 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలకు టైటిల్ అయిన పాపులర్ సాంగ్స్

కొన్ని సార్లు పాటలు బాగా పాపులర్ అవుతాయి. ఎంతగా అంటే ఆ పాట లిరిక్స్ ని టైటిల్ గా పెట్టుకునేంత. సినిమాలకు పేర్లుగా పెట్టుకుంటే అవి కూడా చాలా వరకు హిట్ కావడం విశేషం. అలా తెలుగు సినిమాలకు టైటిల్స్ గా మారిన పాటలపై ఫోకస్..

1. సోగ్గాడే చిన్ని నాయన Soggade Chinni Nayanaఅక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆస్తిపరులు చిత్రంలో ‘సోగ్గాడే చిన్ని నాయన ఒక పిట్ట నైనా కొట్టలేదు సోగ్గాడే.’ అనే పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటనే నాగార్జున తన సినిమాకి పెట్టుకున్నారు.

2. చలో chaloఅల్లు అర్జున్ పరుగు సినిమాలో ‘చల్ చల్ ఛలో’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ సాంగ్ ని నాగ శౌర్య చిత్రానికి పెట్టుకొని సూపర్ హిట్ కొట్టారు.

3. కెవ్వు కేక Kevvu Kekaపవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ లో “కెవ్వు కేక” అనే సాంగ్ ని తీసుకుని అల్లరి నరేష్ మూవీ టైటిల్ గా పెట్టారు.

4. A వచ్చి B పై వాలే A Vachi B Pai Valeప్రభాస్ ఛత్రపతి మూవీ లో ఇదొక సూపర్ హిట్ సాంగ్. ఈ పేరుతో మూవీ వచ్చింది. అందులో పూరి జగన్నాధ్ బ్రదర్ సాయిరాం నటించారు.

5. బంగారు కోడి పెట్ట Bangaru Kodipettaచిరంజీవి హిట్ సాంగ్ “బంగారు కోడి పెట్ట”..ని రామ్ చరణ్ మగధీర లో రీమేక్ చేసారు. ఈ సాంగ్ ని మూవీ టైటిల్ గా పెట్టారు. స్వాతి, నవదీప్ నటించిన మూవీ అంతగా ఆకట్టుకోలేదు.

6. సంథింగ్ సంథింగ్ Something Somethingనువ్వొస్తానంటే నేనొద్దంటానా .. సినిమాలో సంథింగ్ సంథింగ్ అనే హుషారైన సాంగ్ ఉంది. దాని పేరుతో సిద్ధార్థ్ మూవీ చేసాడు. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం విజయం సాధించలేదు.

7. ప్రియతమా నీవచట కుశలమా Priyathama Neevachata Kusalamaకమల్ హాసన్ నటించిన గుణ సినిమాలోని ప్రియతమా నీవచట కుశలమా అనే పాటని వరుణ్ సందేశ్ సినిమాకి టైటిల్ గా పెట్టారు.

8. ఎటో వెళ్ళిపోయింది మనసు Yeto Vellipoindi Manasuనాగ్గార్జున హిట్ మూవీ నిన్నే పెళ్లాడుతాలో ఎటో వెళ్ళిపోయింది మనసు పాట బాగా పాపులర్ అయింది. అదే పేరుతో నాని, సమంత సినిమా చేసారు.

9. వస్తాడు నా రాజు Vastadu Naa Rajuఅల్లూరి సీతారామ రాజు మూవీ లోని సూపర్ హిట్ సాంగ్ వస్తాడు నా రాజు. ఈ సాంగ్ ని మూవీ టైటిల్ గా పెట్టుకొని మంచు విష్ణు సినిమా చేశారు.

10. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు Malli Malli idi Rani Rojuమెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఒకటి. ఈ పేరుతో శర్వానంద్ సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు.

11. ఆహా నా పెళ్లంట Aha Naa Pellantaఅలనాటి క్లాసిక్ చిత్రం మాయాబజార్ లోని ఆహా నా పెళ్లంట పాట పేరుతో రాజేంద్ర ప్రసాద్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు.

12. Mr పర్ఫెక్ట్ Mr.Perfectసుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఆర్య 2.లో Mr పర్ఫెక్ట్ అనే పాట అందరినీ ఆకట్టుకుంది. ఆ టైటిల్ తో ప్రభాస్ సినిమా చేసి హిట్ అందుకున్నారు.

13 . కాటమరాయుడుkatamarayuduఅత్తారింటికి దారేది సినిమాలో “కాటమరాయుడా” అనే పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందరినోట ఆ పాటే పలికింది. అందుకే ఆ పేరునే తన చిత్రానికి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు.

14. నమో వెంకటేశాNamo Venkateshaసినీ పరిశ్రమ మొదలైన కొత్తల్లో ఘంటసాల పాడిన “నమో వెంకటేశా” పాట బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఆ పాటని ఆలయాల్లో వినిపిస్తున్నారు. ఆ పాటనే టైటిల్ గా మార్చుకొని విక్టరీ వెంకటేష్ హిట్ అందుకున్నారు.

15. నువ్వు వస్తానంటే వద్దంటానా !Nuvvostanante nenoddantanaప్రభాస్ హిట్ సినిమా వర్షంలో “నువ్వు వస్తానంటే వద్దంటానా” అనే పాట అందరికీ భలే నచ్చింది. ఆ సూపర్ సాంగ్ తో త్రిష హీరోయిన్ గా సినిమాని తెరకెక్కించారు ప్రభుదేవా. మీరు మంచి సినిమా తీస్తే చూడకుండా ఉంటామా..! అని తెలుగు ఆడియన్స్ హిట్ చేయించారు.

16. సినిమా చూపిస్తా మామ Cinema Choopistha Mavaఅల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా పేరు చెప్పగానే అందులో సినిమా చూపిస్తా మామ పాట తప్పకుండా గుర్తుకొస్తుంది. అంతలా ఆకట్టుకుంది ఆపాట. అందుకే ఆ పాటనే రాజ్ తరుణ్ తన సినిమాకి పెట్టుకొని హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

17. కుందనపు బొమ్మ Kundanapu Bommaసమంతను ఏ మాయ చేసావే సినిమాలో కుందనపు బొమ్మ అని నాగ చైతన్య ముద్దుగా పిలుచుకున్నాడు. ఆ పాటని ఏ ఆర్ రెహమాన్ అందరి గుండెల్లోకి చొచ్చుకుని వెళ్లే విధంగా కంపోజ్ చేశారు. అందుకే డైరక్టర్ వరా ముళ్లపూడి యువ నటీనటులు చాందిని చౌదరి, సుధాకర్‌ లతో తెరకెక్కించిన సినిమాకి కుందనపు బొమ్మ అని పేరు పెట్టుకున్నారు.

18. బంతిపూల జానకి Banthi Poola Janakiబాద్ షా మూవీలో బంతిపూల జానకి పాటని ఎస్ ఎస్ థమన్ అద్భుతం గా ఇచ్చారు. ఎన్టీఆర్, కాజల్ స్టెప్పులతో అదరగొట్టారు. అలా తమ సినిమా అదిరిపోవాలని హాస్యనటుడు ధన్ రాజ్ తన సినిమాకి బంతిపూల జానకి అని పేరు పెట్టుకున్నారు.

19. ఎవడే సుబ్రహ్మణ్యం Yevade Subramanyamలవర్ బాయ్ సిద్దార్ధ్ , మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన మూవీ “కొంచెం ఇష్టం కొంచెం కష్టం”. ఇందులో “ఎవడే సుబ్రహ్మణ్యం” అందరూ హమ్ చేసేలా ఆకట్టుకుంది. సో ఆ పేరుతో నాని సినిమా చేసి అందరితో అభినందనలు అందుకున్నారు.

20. సాహసం శ్వాసగా సాగిపో Sahasam Swasaga Saagipoమహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఒక్కడు. అందులోని “సాహసం శ్వాసగా సాగిపో” పాట కథలో కీలకం. అటువంటి కీలక ఆపాటని తన ట్రావెలింగ్ స్టోరీకి పేరుగా పెట్టుకున్నారు నాగచైతన్య. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

21. చిత్రం భళారే విచిత్రం Chitram Bhalare Vichitramమహానటుడు నందమూరి తారకరామారావు నటించిన దాన వీర సూర కర్ణ సినిమాలో “చిత్రం భళారే విచిత్రం” సూపర్ హిట్. ఆ పేరుతో పాతికేళ్ల క్రితం నరేష్ సినిమా వచ్చింది. సూపర్ హిట్. రీసెంట్ గా కూడా హారర్ థ్రిల్లర్ మూవీకి ఇదే పేరు పెట్టుకున్నారు.

22. ఎక్కడికి పోతావు చిన్నవాడాYekkadiki Pothav Chinnavada దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మబలం చిత్రంలోని “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అప్పట్లో ఓ సంచలనం. ఆ పాటని పేరుగా పెట్టుకొని నిఖిల్ ఇప్పుడు సంచలన హిట్ సాధించాడు.

23. హలో గురూ ప్రేమ కోసమే ..Hello Guru Prema Kosameఅక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా నిర్ణయం. ఇందులోని “హలొ గురూ ప్రేమ కోసమే” సాంగ్ అప్పటి కాలేజీ కుర్రోళ్ళకి ఇష్టమైన పాటగా మారింది. ఆ పాటతో నాగార్జున తనయుడు అఖిల్ సినిమా చేస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇంకా మేము మిస్ చేసిన టైటిల్స్ ఏమైనా ఉంటే ..కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Vachi B Pai Vaali Movie
  • #Aha Naa Pellanta Movie
  • #Bangaru Kodipetta Movie
  • #Banthipoola Janaki Movie
  • #Chalo Movie

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

17 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

20 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version