సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ శైలి అందరికీ తెలిసిందే. పోసాని మాట కరకు గానీ, మనసు మంచిది అని సినీ జనాలు చెప్పుకుంటుంటారు. అలాంటి పోసాని, తాజాగా మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై స్పందించారు.
ముందుగా మెగాస్టార్ గురించి వ్యాఖ్యానిస్తూ… “చిరంజీవి చాలా నిజాయితీపరుడు. గతంలో నాకు ప్రజారాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను” అని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు పోసాని.