Posani Krishna Murali: ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎంపికైన పోసాని.. !

  • February 4, 2023 / 10:43 AM IST

పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు. రైటర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈయన మాట తీరులానే కథలు కూడా విలక్షణంగా ఉండేవి. పవిత్ర బంధం, గోకులంలో సీత, అల్లుడా మజాకా వంటి సినిమాలు ఎంతలా బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్, కొరటాల శివ, బి.వి.ఎస్.రవి వంటి స్టార్ డైరెక్టర్లు ఈయన శిష్యులే.రైటర్ గానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు పోసాని.

ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఈయనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసింది పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ‘ఏక్ నిరంజన్’ సినిమాతో కొత్త పోసానిని మనకు అందించారు పూరీ. తర్వాత ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ‘నాయక్’ వంటి చిత్రాలు పోసాని కామెడీ టైమింగ్ ను ఇంప్రూవ్ చేశాయి. మరోపక్క రాజకీయాల్లో కూడా పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు పోసాని. వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటూ ఈయన ప్రెస్ మీట్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా పోసానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. APFDC(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ గా పోసాని ఎంపికయ్యారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.ఈ వేడుకకు మాజీ మంత్రి పేర్ని నాని..నిర్మాతల మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల ..

తుమ్మలపల్లి రామసత్యనారాయణ బాసిరెడ్డి, అనుపమ రెడ్డి..బాపిరాజు.అలంకార ప్రసాద్.సాయి.ఒంగోలు బాబు..పి.ఎల్.కె రెడ్డి తదితరులు హాజరయ్యారు..అతి త్వరలో AP లో నంది అవార్డ్స్ మరియు రాయితీలు షూటింగ్స్ జరపడం కోసం కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేస్తాను అని పోసాని గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus