#AnyasTutorialOnAHA: సూపర్ రెస్పాన్స్ ను సొంతం ‘అన్యాస్ ట్యుటోరియల్’ సిరీస్..!

ప్రతి వారం ఏదో ఒక మూవీ లేదా వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తున్న ‘ఆహా’ ఓటీటీ వారి.. నుండీ ఈ వారం వచ్చిన సిరీస్ ‘అన్యస్ ట్యుటోరియల్’. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జూలై 1 నుండి ఆహా స్ట్రీమింగ్ అవుతూ విశేషాధారణ దక్కించుకుంటుంది. రెజీనా , నివేదితా సతీష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ను ‘బాహుబలి’ నిర్మాతలైన ‘ఆర్కా మీడియా వర్క్స్’ వారు ‘ఆహా’ వారితో కలిసి నిర్మించారు.

మధు(రెజీనా) లావణ్య(నివేదిత) లు అయిన ఇద్దరు అక్కా చెల్లెల్లు కథ ఇది. తమ కుటుంబంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా బాగా డిస్టర్బ్ అయిన లావణ్య.. సెపరేట్ గా ఫ్లాట్ తీసుకుని అందులోకి మారిపోయి అన్యాస్ ట్యుటోరియల్ ని స్టార్ట్ చేస్తుంది. వీటి ద్వారా నెటిజన్ల అటెన్షన్ ను డ్రా చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా వాల్యూ పెంచుకోవాలని, ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలని భావించి కొన్ని హారర్ వీడియోలను షేర్ చేస్తుంది.

దీంతో ఆమె ఖాతాకి ఫాలోవర్లు పెరుగుతారు. కానీ ఈ ట్యుటోరియల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరుగా మాయమవుతూ ఉంటారు. లావణ్య లో కూడా వింత వింత మార్పులు వస్తాయి. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? మధు చివరికి తన సోదరిని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. భయపడుతూనే ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ ఆలోచింప చేసే విధంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అందుకే ప్రేక్షకులు ఈ సిరీస్ కు బాగా కనెక్ట్ అయ్యారు.

ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే విధంగా అన్యాస్ ట్యుటోరియల్ ను తీర్చిదిద్దింది దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి.ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ఈ సిరీస్. ఏడు ఎపిసోడ్లుగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. హ్యాపీగా ఓసారి లుక్కేయండి. మీరు థ్రిల్ ఫీలవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇవి ప్రేక్షకులు సోషల్ మీడియాలో చెబుతున్న మాటలు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus