గోదావరి జిల్లాల్లో నివసించే రెండు కుటుంబాలు. ఆ రెండు కుటుంబాల పెద్దలు సరస్వతి, కొమర్ రాజు. సరస్వతి కొడుకుతో కొమర రాజు కూతురితో వివాహం జరగడం వల్ల వీళ్ళిద్దరూ వియ్యంకుడు, వియ్యంకురాలు అవుతారు.అంతా సంతోషమే అనుకున్న టైములో.. నూతన దంపతులు హత్య చేయబడతారు. దాంతో ఈ రెండు కుటుంబాలు కృంగిపోయి బాధలో మరింత దగ్గరవుతాయి. తమ పిల్లని చంపిన వాడిని చంపి పగతీర్చుకోవాలి అని భావిస్తాయి. వీళ్ళు అనుమానిస్తున్న వ్యక్తి ‘గాలివాన’ కురుస్తున్న రోజున యాక్సిడెంట్ కు గురయ్యి వీళ్ళ ఇంటి దగ్గర పడివుంటాడు.
తర్వాత రోజు ఉదయం వెళ్ళి చూస్తే అతను చచ్చి పడి ఉంటాడు. అతన్ని హత్యచేసింది బయట వ్యక్తా లేక ఈ రెండు కుటుంబాలకి చెందిన వ్యక్తా? అన్నది జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ‘గాలివాన’ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్ 14న రాత్రి 12 గంటల నుండీ ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. కొన్ని గంటల్లోనే మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేసింది.
ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, చాందిని చౌదరి ల నటన ఈ సిరీస్ కు హైలెట్ అంటున్నారు. ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా ఈ ‘గాలివాన’ వెబ్ సిరీస్ ను నిర్మించింది ‘జీ5’ సంస్థ. చైతన్య, నందిని రాయ్, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు కూడా ఈ సిరీస్ లో నటించారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!