తెలుగు సినిమాలో జీవిత కథలు తక్కువగా వస్తుంటాయి. గతంలో ఒకరిద్దరు ఇలాంటి ప్రయత్నాలు చేసినా అవి విడుదలకు నోచుకోక చాలా ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ గొప్ప వ్యక్తి జీవిత కథ సినిమా రూపం దాల్చబోతోంది. అతనే అమరజీవి పొట్టి శ్రీరాములు. తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్ర సంకల్పంతో.. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన జీవితమే ఇప్పుడు చిత్ర రూపం దాలుస్తోంది.
‘అమరజీవి పొట్టి శ్రీరాములు’ పేరుతో పొట్టి శ్రీరాములు జీవితాన్ని సినిమాగా చూపించబోతున్నారు. కణ్మణి దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ చిత్రాన్ని కూచిపూడి రాజేంద్రప్రసాద్ రూపొందిస్తున్నారు. సాలూరి వాసురావు సంగీత దర్శకులు. సినిమా నిర్మాణం పనులు పాటల రికార్డింగ్‌తో లాంఛనంగా జరిగింది. ‘‘తెలుగే మన ఆత్మబలం.. తెలుగే మన ఆయుధం…’’ అనే పాట రికార్డింగ్‌ను ఇటీవల నిర్వహించారు. సినిమా గురించి దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రం తీస్తున్నాం. తెలుగు, తమిళ ప్రాంతాలతోపాటు ఉత్తరాదిలోనూ చిత్రీకరణ ఉంటుందని చెప్పారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!