Prabhakar: ట్రోల్స్ విషయంలో ప్రభాకర్ హ్యాపీగానే ఉన్నారా?

గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరగగా ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ మనస్సులో ఉన్న అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. బుల్లితెర సీరియళ్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చంద్రహాస్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఒక సందర్భంలో ప్రభాకర్ తన కొడుకును ప్రేక్షకులకు పరిచయం చేయగా

ఆ సమయంలో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించడం, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించిన ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రహాస్ ను పరిచయం చేసిన ఇంటర్వ్యూపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని ప్రభాకర్ అన్నారు. వీడు హీరో ఏంటని అటూఇటూ తిరిగాడు ఏంటని జేబులో చేతులు పెట్టుకున్నాడు ఏంటని విపరీతంగా ట్రోల్ చేశారని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

ఎలా అయితే ఏంటని వాడు జనాల్లోకి వెళ్లాడని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. జనాలకు వాడు తెలియాలని వాడిని పరిచయం చేశానని ప్రభాకర్ కామెంట్లు చేశారు. వాడు సినిమాలలో బాగా చేస్తే ప్రేక్షకులు వాడు బాగా చేశాడని అంటారని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. రేపు చంద్రహాస్ ఎంత బాగా యాక్ట్ చేస్తే అంత బాగా ప్రేక్షకులు వాడిని ఆదరిస్తారని ప్రభాకర్ కామెంట్లు చేశారు. జనాలు చాలా ప్లెయిన్ గా ఉంటారని వాళ్లకు అనిపించింది చెబుతారని ప్రభాకర్ తెలిపారు.

తన కొడుకుపై ట్రోల్స్ వచ్చినా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కడంతో ప్రభాకర్ హ్యాపీగానే ఫీలవుతున్నారని బోగట్టా. చంద్రహాస్ సినిమాల్లో హీరోగా సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. చంద్రహాస్ కూడా ఈ ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గతంలో ఏ హీరోకు జరగని స్థాయిలో చంద్రహాస్ పై ట్రోలింగ్ జరగడం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus