ఎండాకాలం మాత్రమే తగిలే సన్ స్ట్రోక్.. మన సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాలంతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కొందరికి తగులుతుంటుంది. అలా రీసెంట్ గా సన్ స్ట్రోక్ తగిలించుకున్న వ్యక్తి బుల్లితెర మెగాస్టార్ గా అభివర్ణించబడే ప్రభాకర్ (Prabhakar) . తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ సొంత డబ్బులు పెట్టి నిర్మాతగా మారి మరీ “రామ్ నగర్ బన్నీ” (Ramnagar Bunny) అనే సినిమాను నిర్మించాడు ప్రభాకర్. దాదాపుగా రెండు కోట్ల రూపాయల మేరకు ఖర్చయ్యిందట ఈ సినిమాను విడుదల చేయడానికి.
మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని మరీ విడుదల చేసిన ఈ చిత్రానికి కనీస స్థాయి కలెక్షన్స్ రాలేదు. అయితే.. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాత్రం సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో “కలెక్షన్స్ రాలేదు కానీ సినిమా హిట్టే” అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇకపోతే.. చంద్రహాస్ ను హీరోగా ఎస్టాబ్లిష్ చేసేవరకు ఊరుకునేలా లేడు ప్రభాకర్ (Prabhakar) . ఆల్రెడీ రెండో సినిమాను కూడా స్వంత బ్యానర్ లోనే తీయడానికి సన్నద్ధమవుతూ.. మూడో సినిమాకి ప్రొడ్యూసర్స్ ను పట్టుకొనే పనిపడ్డాడు. మరి ప్రభాకర్ కు తగిలిన సన్ స్ట్రోక్ నుండి తేలుకోవడానికి ఎంత పడుతుందో? అసలు హీరోగా చంద్రహాస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంకెంత టైమ్ పడుతుందో?
ఆడియన్స్ చంద్రహాస్ ను హీరోగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? వంటి విషయాలను కన్సిడర్ చేస్తున్నప్పుడు ప్రభాకర్ కొన్నాళ్లపాటు అలుపెరుగని యుద్ధం చేయాల్సిందేనని అర్థమవుతోంది. “రామ్ నగర్ బన్నీ” సినిమా తీయడానికే ఆస్తులు అమ్ముకున్నా అని చెప్పుకున్న ప్రభాకర్.. మరి కొడుకును హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకెన్ని చేస్తాడో చూడాలి.