‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) తర్వాత హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) , దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘శ్వాగ్’ (Swag) . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ (Ritu Varma) , దక్ష నగార్కర్ (Daksha Nagarkar) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) , శరణ్య ప్రదీప్ (Saranya pradeep) ..లు కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ కొత్తగా ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.
కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రెండో రోజు ఇంకా తగ్గాయి. ఆదివారం కూడా పెద్దగా పుంజుకుంది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.32 cr |
సీడెడ్ | 0.08 cr |
ఉత్తరాంధ్ర | 0.14 cr |
ఈస్ట్ | 0.06 cr |
వెస్ట్ | 0.04 cr |
గుంటూరు | 0.09 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.20 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.10 cr (షేర్) |
‘శ్వాగ్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.1.10 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.