ఆ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ అది కాదంట..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహూ’ చిత్రంలో నటిస్తూనే మరో పక్క ‘జిల్` ఫేమ్ రాధాకృష్ణ‌ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ‘గోపి కృష్ణ మూవీస్’ ‘యూ.వీ.క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 1960 లలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్ర్ర కథ ఉండబోతోందట. ఈ చిత్రంలో వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజంలేదని తెలుస్తుంది. కేవలం ఆ వింటేజ్ కార్లను ఇష్టపడే వ్యక్తిగా మాత్రమే ప్రభాస్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ వింటేజ్ కార్లకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందని సమాచారం. తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కబోతోంది . 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక 2019 ఆగస్టు 15 న ప్రభాస్ ‘సాహూ’ చిత్రం విడుదల చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus