‘ప్రభాస్ 21’ .. షాకింగ్ అప్డేట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం .. తన 20 వ చిత్రం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. గోపీచంద్ తో ‘జిల్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రాధే శ్యామ్’ , ‘ఓ డియర్’ వంటి టైటిల్స్ ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేయించారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లోనే దర్శకుడు నాగ్ అశ్విన్ బిజీగా గడుపుతున్నాడట.

అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసాడని తెలుస్తుంది. సెట్స్ పైకి వెళ్ళాక బడ్జెట్ పరిమితి మించకుండా ప్లాన్ ఇప్పటి నుండీ రెడీ చేసుకుంటున్నాడట. ఆన్ సెట్స్ కు వెళ్ళాక .. బడ్జెట్ శృతిమించి పోయిన సినిమాలు అనేకం ఉన్నాయి. అంతెందుకు ప్రభాస్ ‘సాహో’ చిత్రమే ఆ లిస్ట్ లో ఉంది. అందుకే ఇలా ముందు నుండీ పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట నాగ్ అశ్విన్. ‘ప్రభాస్ 21’ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ రూపంలోనే 50 కోట్లు ఖర్చు అవుతుందని నాగ్ అశ్విన్ తెలిపినట్టు తెలుస్తుంది. వీటికే ఇంత లెక్క చెబుతుంటే.. మరి సినిమా పూర్తయ్యేలోపు ఎంత బడ్జెట్ అవుతుందో అని అప్పుడే ఫిలింనగర్లో డిస్కషన్స్ కూడా మొదలైపోయాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus