ప్రభాస్-ఆమీర్ లతో పాన్ ఇండియా మూవీ..!

బాలీవుడ్ లో ఆ మధ్య కాలంలో వర్కౌట్ అయ్యాయి కానీ… టాలీవుడ్ లో మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతోనే మొదలవుతుంది. ఇంతకీ.. ఏంటది అంటే.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చెయ్యడం. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. రాజమౌళి వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇద్దరి హీరోల ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని వాటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చెయ్యకపోతే… అది హిట్ అయినా చాలా తేడాలు వచ్చేస్తాయి.

ఆ కాల్యుకులేషన్లు రాజమౌళికి మాత్రమే తెలుస్తాయి అనడంలో అతిసయోక్తి లేదు. ఇప్పుడు రాజమౌళి బాటలో చాలా మంది దర్శకులు ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఓ కుర్ర డైరెక్టర్ చెప్పిన కాంబోస్ వింటే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. గతేడాది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ .. ఇప్పుడు తన డ్రీం ప్రాజెక్ట్ ల గురించి చెప్పి అందరిలోనూ ఆసక్తిని పెంచాడు. స్వరూప్ మాట్లాడుతూ..”నాకు మల్టీ స్టారర్ చిత్రాలంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ -ఎన్టీఆర్ లతో జాన్ విక్ స్టైల్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీయాలని ఉంది.

అంతేకాదు ఆమిర్ ఖాన్- ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ ను తెరకెక్కించాలని ఉంది. అది నా డ్రీం ప్రాజెక్ట్. వీటితో పాటు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయాలని కూడా ఉంది” అంటూ తెలిపాడు. స్వరూప్ చెప్పిన ప్రాజెక్ట్ లు అన్నీ చాలా ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ – ఆమీర్ లతో సినిమా అంటే అది ‘ఆర్.ఆర్.ఆర్’ ను మించిన ప్రాజెక్ట్ అనాలి. కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి.. ప్రభాస్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.. కానీ ఆమీర్ ఖాన్ ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus