Prabhas: అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్న ప్రభాస్.. ఏమైందంటే?

‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ నుండి ‘సాహో’ వంటి యావరేజ్ సినిమా, ‘రాధే శ్యామ్’ వంటి డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ కూడా అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి ‘ఆదిపురుష్’ కాగా మరొకటి ‘సలార్’. మొన్నామధ్య ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. విజువల్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని, కార్టూన్ సినిమాల ఉందని.. ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా పెదవి విరిచారు.

దీంతో రీ షూట్ల పేరు చెప్పి ‘ఆదిపురుష్’ రిలీజ్ ను వాయిదా వేసింది చిత్రబృందం. నిజానికి ప్రభాస్ అభిమానులకు కూడా ‘ఆదిపురుష్’ పై ఇంట్రెస్ట్ లేదు. ఈ నేపథ్యంలో ‘సలార్’ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో నిర్మాతలని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. కానీ చిత్ర బృందం ‘సలార్’ గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీని వెనుక ప్రభాస్ ఉన్నాడనేది ఇన్సైడ్ టాక్. అవును.. ‘సలార్’ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో అనౌన్స్ చేయొద్దని ప్రభాస్ టీంకి గట్టిగా చెప్పాడట.

‘ఆదిపురుష్’ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ‘సలార్’ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వొద్దని.. ప్రభాస్ కోరినట్టు తెలుస్తోంది. జూన్ లో ‘ఆదిపురుష్’ ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. సో దాని తర్వాత ‘సలార్’ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారన్న మాట. అయితే ‘సలార్’ ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ చిత్ర బృందం ప్రకటించింది. మరి మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాల ప్రమోషన్లను ప్రభాస్ హ్యాండిల్ చేయగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus