Prabhas, Mahesh: ప్రభాస్ – మహేష్.. ఇక పరిగెత్తాల్సిందే!

ఎంతగానో అభివృద్ధి చెందుతున్న సినిమా పరిశ్రమలను ఒక్కసారిగా కరోనా నేలకేసి కొట్టినంత పని చేస్తోంది. అయినప్పటికీ అగ్ర హీరోల వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. కసితో చాలా పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు నష్టపోవచ్చు గాని రానున్న రోజుల్లో మాత్రం అంతకుమించి అనేలా మార్కెట్ గ్రోత్ పెరుగుతుందని చెప్పవచ్చు. పక్క ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే మన టాలీవుడ్ హీరోలు మాత్రం వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా ప్రభాస్ ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టడం భవిష్యత్తుకు ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు. ఇక మహేష్ కూడా మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ ఇండస్ట్రీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. ప్రభాస్ వచ్చే నెల ఎలాగైనా సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని ప్లాన్ సెట్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు కూడా జూలైలోనే సర్కారు వారి పాట షూటింగ్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నాడు.

ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్రేక్ వేయకూడదని కుదిరితే గేర్లు వేసి మరింత స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సెట్స్ పై ఉండగా మహేష్ ‘సర్కారు వారి పాటతో’ పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి వీరి ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus