కొత్త బిజినెస్ లోకి రామ్ చరణ్, ప్రభాస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగానే కాదు నిర్మాతగా విజయం సాధిస్తున్నారు. ఇది ఒకవైపు మాత్రమే.. ఒక వ్యాపారవేత్తగా కూడా సక్సస్ అయ్యారు. అతనికి అనేక పెద్ద కంపెనీలలో భాగస్వామ్యం ఉంది. అందుకే రామ్ చరణ్ తో ప్రభాస్ చేతులు కలపనున్నారు. అసలు బిజినెస్ అంటేనే చాలా దూరం ఉండే ప్రభాస్ .. చరణ్ వ్యాపార దృష్టి నచ్చి అతనితో కలిసి అడుగు వేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత ఉంది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా ఉంది. అందుకే ఆ సమస్యను తగ్గించడానికి  ప్రభాస్, రామ్ చరణ్ లు థియేటర్స్ బిజినెస్ లోకి దిగుతున్నారని తెలిసింది.

ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరూ కలసి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లీజ్‌కు తీసుకుంటున్నారని ఫిలిం నగరవాసులు తెలిపారు. తమ సినిమాలు ఏడాదికి ఒకటి, రెండు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు మినహా మిగతా వేళల్లో చిన్న సినిమాలు ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన చిన్న నిర్మాతలకు బాగా హెల్ప్ అవుతుందని టాలీవుడ్ వర్గాలవారు చెబుతున్నారు. అయితే ఆ నాలుగు కుటుంబాల వారు చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నట్టు.. వీరు కూడా తొక్కేస్తారని, వారికీ అనుకూలమైన చిత్రాలను మాత్రమే రిలీజ్ చేస్తారనే  విమర్శించేవారు కూడా లేకపోలేదు. మరి చెర్రీ, ప్రభాస్ లు ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus