Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ.. ప్రకటన అప్పుడేనా?

  • November 5, 2022 / 03:00 PM IST

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు కచ్చితంగా విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించగా ట్రైలర్ తో ఆ విమర్శలకు చెక్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు 2023 సంవత్సరం సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకుంది.

2023 సంక్రాంతికి భారీ స్థాయిలో పోటీ ఉండటంతో ఆ సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తే తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కే అవకాశం ఉండటంతో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ను సమ్మర్ కు వాయిదా వేశారు. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కే ఛాన్స్ తో పాటు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ప్రభాస్ మరో బాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని త్వరలో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుందని సమాచారం అందుతోంది.

ప్రభాస్ సిద్దార్థ ఆనంద్ కాంబినేషన్ లో సినిమా రానుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చాలా సంవత్సరాల క్రితం ప్రభాస్ కు అడ్వాన్స్ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్ ఒక విధంగా ప్రభాస్ సొంత సంస్థ అనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ సిద్దార్థ ఆనంద్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ప్రభాస్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus