Prabhas: యూవీ-ప్రభాస్ బ్రేకప్.. ఫ్యాన్స్ అయితే హ్యాపీనేమో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్ వంటిది ‘యూవీ క్రియేషన్స్’. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ తో ఈ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ పడింది. ప్ర‌మోద్‌, వంశీ ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదే బ్యానర్లో ‘రన్ రాజా రన్’ ‘జిల్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ ‘భాగమతి’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటన్నిటినీ ప్రభాస్ దగ్గరుండి ప్రమోట్ చేసాడు. అన్ని మూవీస్ సక్సెస్ సాధించినవే.

అయితే వీటికి వచ్చిన లాభాల్ని తీసుకెళ్ళి ‘సాహో’ కి పెట్టేసారు.’బాహుబలి’ పుణ్యమా అని దానికి పెట్టిందానికి, వచ్చిందానికి కరెక్ట్ గా సరిపోయింది. అయితే ‘రాధే శ్యామ్’ బడ్జెట్ మాత్రం భారీగా పెరిగిపోయింది. ఈ చిత్రానికి దాదాపు రూ.300కోట్ల వరకు బడ్జెట్ అయిపోయింది. షూటింగ్ సమయంలో బడ్జెట్ సమస్యలు తలెత్తితే ప్రభాస్ అండగా నిలబడ్డాడు. అయితే ఇప్పుడు అతను కూడా విసిగిపోయినట్టు స్పష్టమవుతుంది. ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాలకి యూవీని దూరంగా పెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడట.

మారుతీ దర్శకత్వంలో అతను చేయబోయే హారర్ కామెడీ మూవీని దానయ్య నిర్మిస్తున్నారు. మారుతీ కూడా ‘యూవీ క్రియేషన్స్’ వారికి అత్యంత సన్నిహితుడే. అయినప్పటికీ ప్రభాస్ వంటి స్టార్ హీరోతో చేయబోయే మూవీకి వేరే నిర్మాతతో చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ రిలీజ్ తర్వాత కొన్నాళ్ళ పాటు ప్రభాస్- యూవీ లు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘సలార్’ ‘ఆది పురుష్’ ‘స్పిరిట్’ ‘ప్రాజెక్టు కె’ ప్రభాస్- కరణ్ జోహార్ ల ప్రాజెక్టులకి యూవీ దూరంగా ఉండనుందన్న మాట.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus