Prabhas: నెట్టింట వైరల్ అవుతున్న ప్రభాస్ బైక్ వీడియో చూశారా..!

రెబల్ స్టార్, పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డేకి తక్కువ టైమే ఉంది. దీంతో ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి సర్ ప్రైయిజింగ్ అప్ డేట్స్ ఇస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 23 ఆదివారం కావడంతో ఈ వీకెండ్ అంతా సోషల్ మీడియాని ప్రభాస్ పేరుతో షేక్ చెయ్యాలని, ట్రెండింగ్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేసింది కాబట్టి, బర్త్ డే కి విషెస్ తో కూడిన కొత్త పోస్టర్ ఏదైనా వదులుతారేమోననేది వారి ఆశ.. అలాగే ‘సలార్’ నుండి సాలిడ్ లుక్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ – K’ నుండి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ రాలేదు. దీంతో పుట్టినరోజు కానుకగా ఆ కోరిక నెరవేరుతుందనే భావనతోనే ఎదురు చూపులు చూస్తున్నారు.. ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘సలార్’ కి సంబంధించిన ఓ లీక్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాక యావత్ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పేలా చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా ‘సలార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఫస్ట్ టైం ప్రభాస్ తో జతకడుతుంది. రాజ మన్నార్ గా జగపతి బాబు, అతని కొడుకు వరద రాజ మన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ వాడిన బైక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఈ బైక్ డిజైన్ చేయించారట. బైక్ నడుపుతుంది ప్రభాసేనా లేక మరెవరైనానా అనేది క్లారిటీగా తెలియడం లేదు కానీ బైక్ మాత్రం సింపుల్ గా భలే ఉంది. వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus