Prabhas: ఆ సినిమాతో ప్రభాస్ నిర్మాతలకు భారీ లాభాలు ఖాయమా?

స్టార్ హీరో ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కడం ఈ సినిమాలకు మైనస్ అయింది. అయితే తర్వాత సినిమాలకు సంబంధించి ఈ పొరపాట్లు జరగకుండా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా మారుతి సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే బడ్జెట్ తక్కువే అయినా క్వాలిటీతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా మారుతికి పేరుంది.

ప్రభాస్ మాత్రమే కాకుండా మారుతి కూడా ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని బోగట్టా. పక్కా కమర్షియల్ మూవీ తర్వాత మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఓవర్ బడ్జెట్ వల్ల సినిమాలకు లాభాలు రాకపోవడంతో ప్రభాస్ సినిమాల బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాకు మారుతి కూడా రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నారు. ప్రభాస్, మారుతికి ఈ సినిమా ద్వారా భారీ మొత్తం దక్కనుందని తెలుస్తోంది.

మారుతి ఈ సినిమా కథ విషయంలో, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిమానుల కామెంట్లను పట్టించుకోకుండా ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వెనుక అసలు కారణం ఇదేనని సమాచారం అందుతోంది.

ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ప్రభాస్ కు ఈ సినిమా ద్వారానే ఎక్కువ మొత్తం లాభాలు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్ మారుతి మూవీకి ఊహించని స్థాయిలో లాభాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus