Prabhas, Kriti Sanon: కృతిపై అభిమానాన్ని చాటుకున్న ప్రభాస్.. ఏమైందంటే?

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ప్రభాస్ వేగంగా సినిమాలలో నటిస్తూ ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా ఒకింత నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ నెల 27వ తేదీన కృతి సనన్ పుట్టినరోజు కాగా ప్రభాస్ కృతిసనన్ ఫోటో షేర్ చేయడంతో పాటు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే కృతిసనన్.. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ప్రభాస్ పేర్కొన్నారు. ఆదిపురుష్ మూవీలో మీ మ్యాజిక్ ను ప్రపంచం చూసేవరకు వేచి ఉండలేనని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కృతిసనన్ ను మెచ్చుకుంటూ ప్రభాస్ పోస్ట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ తో ప్రభాస్ బిజీ అయ్యారు. సలార్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుండగా ప్రాజెక్ట్ కే 2024లో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతుండగా కృతి సనన్ సీత రోల్ లో సైఫ్ అలీ ఖాన్ రావణుని రోల్ లో నటించనున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారినా ఈసారి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం అందుతోంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus