Prabhas: సాహో రిజల్ట్ పై ప్రభాస్ ఏమన్నారో తెలుసా?

సాధారణంగా స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ప్రభాస్ మాత్రం కెరీర్ తొలినాళ్ల నుంచి దర్శకుల హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ గత సినిమా సాహో నార్త్ ఇండియాలో సక్సెస్ సాధించినా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రభాస్ అభిమానులలో చాలామందికి ఈ సినిమా నచ్చలేదు.

అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ సాహో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమా తర్వాత తాను హీరోగా నటించిన సాహో సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుందని ప్రభాస్ తెలిపారు. సాహో సక్సెస్ కావడంతో తాను ఆనందిస్తున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. నార్త్ ఆడియన్స్ సాహో మూవీని ఆదరించారని ఆయన అన్నారు. సాహో సినిమాలో లోపాలు ఉన్నాయని అయినప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాను ఇష్టపడ్డారని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ప్రపంచంలో ఎక్కడా ఆడని విధంగా నార్త్ లో ఆ మూవీ ఆడిందని ప్రభాస్ అన్నారు. సాహో మూవీని ప్రేక్షకులకు దగ్గర చేసిన విలేకర్లకు ధన్యవాదాలు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా తన కెరీర్ లో ముఖ్యమైన సినిమా అని ఆ సినిమా గురించి మాటల్లో చెప్పలేనని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నా లైఫ్ లో జరిగిన గొప్ప మ్యాజిక్ బాహుబలి అని ప్రభాస్ కామెంట్లు చేశారు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కథలను ఎంపిక చేసుకునేవాడినని ప్రస్తుతం వివిధ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని కథలను ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని ప్రభాస్ పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ అద్భుతమైన మనిషి అని ప్రాజెక్ట్ కె సినిమాలో ఆయనతో కలిసి నటించడం సంతోషాన్ని కలిగిస్తోందని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus