Prabhas: ఆ దేశంలో కూడా సత్తా చాటుతున్న ప్రభాస్!

స్టార్ హీరో ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో నటించిన రాధేశ్యామ్ విడుదలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ సినిమాపై అంచనాలను పెంచగా టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరీగా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి2 సినిమాతో ప్రభాస్ కు విదేశాల్లో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.

రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కోసం జపాన్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం. జపాన్ ప్రేక్షకుల ప్రచారం పట్ల ప్రభాస్ టాలీవుడ్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో జపాన్ లో క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. జపాన్ నుంచి ప్రభాస్ కోసం గతంలో ఫ్యాన్స్ వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ కు జపాన్ నుంచి వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ తో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రస్తుతం జపాన్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ డిజైన్లను సొంతంగా గీసి పబ్లిష్ చేయడంతో పాటు జపాన్ భాషలో రాధేశ్యామ్ మూవీ టీజర్ కు రివ్యూలు పెడుతున్నారు. జపాన్ లో ఈ స్థాయిలో క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోగా ప్రభాస్ నిలిచారు. రాధేశ్యామ్ సినిమాను జపనీస్ సబ్ టైటిల్స్ తో జపాన్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రాధేశ్యామ్ మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

చాలా రోజుల క్రితమే రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోని రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus