ప్రస్తుతం మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా సులభంగా తెలుసుకుంటున్నాం. ఎవరైనా సెలబ్రిటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే వికీపీడియా ద్వారా మాత్రమే ఆ సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అయితే సౌత్ నుంచి వికీపీడియాలో అత్యధిక వ్యూస్ సాధించిన హీరోలలో స్టార్ హీరో ప్రభాస్ తొలి స్థానంలో నిలిచారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా తెచ్చుకున్న గుర్తింపు వల్ల ప్రభాస్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
వికీపీడియాలో 15.94 మిలియన్ల వ్యూస్ తో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును ప్రభాస్ సొంతం చేసుకున్నారు. ఈ రికార్డు విషయంలో ఇతర స్టార్ హీరోలంతా ప్రభాస్ కు తరువాత స్థానాల్లోనే ఉన్నారు. ఈ అరుదైన రికార్డు ప్రభాస్ కు మాత్రమే సాధ్యం కాగా ప్రభాస్ తరువాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నారు. 15.82 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో ఉన్న విజయ్ రాబోయే రోజుల్లో మొదటి స్థానం దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ప్రభాస్, విజయ్ తరువాత స్థానాల్లో ప్రిన్స్ మహేష్ బాబు 13.5 మిలియన్ వ్యూస్ తో ఉన్నారు. రజినీకాంత్ 12.9 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉండగా అల్లు అర్జున్ 12.6 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉన్నారు. 6,7,8 స్థానాల్లో కోలీవుడ్ హీరోలు కమల్ హాసన్, ధనుష్, అజిత్ ఉండగా తొమ్మిదో స్థానంలో 10 మిలియన్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ పదో స్థానంలో 10 మిలియన్ వ్యూస్ తో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!