వైరల్ అవుతున్న ప్రభాస్, రవీనా టాండన్ ల డ్యాన్స్ వీడియో..!

  • August 22, 2019 / 04:26 PM IST

‘సాహో’ రిలీజ్ కు మరో 8 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రమోషన్‌లలో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నాచ్‌ బలియే-9’ డ్యాన్స్‌ రియాలిటీ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షో లో పాల్గొన్నాడు ప్రభాస్. ఇక్కడ ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఇదే కార్యక్రమంలో ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూడా పాల్గొంది. తెలుగులో కూడా ఈమె నాగార్జున సరసన ‘ఆకాశవీధిలో’ అలాగే బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’ వంటి సినిమాల్లో నటించింది.

ఇక ఈ కార్యక్రమంలో రవీనా టాండన్, ప్రభాస్ లను ఓ పాటకు డ్యాన్స్ చేయాలని కోరారు. ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై…’ పాటకు ప్రభాస్, రవీనాల స్టెప్పులు వేయించారు. ఇక ప్రభాస్ కూడా రవీనా చీర నోటితో పట్టుకుని తెగ స్టెప్పులు వేసాడు. ప్రస్తుతం ఈ ఫోటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆగష్టు 30 న ‘సాహో’ చిత్రం విడుదల కాబోతుంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus