Prabhas: వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ప్రభాస్ సాయం.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఎవరికైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోలేరనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గురించి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం గొప్పగా చెప్పుకుంటారు. తాజాగా ప్రభాస్ వృద్ధాశ్రమం కోసం చేసిన సహాయం గురించి శివాజీ రాజా (Sivaji Raja) కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఒక వృద్ధాశ్రమం నిర్మించడానికి ప్రభాస్ సహాయం అడిగితే రూ.2 కోట్ల సహాయం చేశారని శివాజీ రాజా అన్నారు. మిర్చి (Mirchi) షూటింగ్ సమయంలో ఒక అభిమాని ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ప్రభాస్ ఆ అభిమానిని షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మరీ కలవడం గమనార్హం.

స్టార్ హీరో ప్రభాస్ ఎన్నో సహాయాలు చేసినా ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. రెండు కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాకపోయినా ప్రభాస్ మాత్రం ఆ మొత్తాన్ని సహాయం కోరిన వెంటనే ఇచ్చేశారు. రాజు ఎక్కడున్నా రాజే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం యాంకర్ సుమ ఒక వృద్ధాశ్రమం నిర్మాణం విషయంలో చొరవ చూపారు. ఆ సమయంలో పవన్ (Pawan Kalyan) , ప్రభాస్, మంచు లక్ష్మీ (Manchu Lakshmi) , ఎస్పీ బాలు (S. P. Balasubrahmanyam) సహాయం చేశారు.

వృద్ధాశ్రమం కోసం ప్రభాస్ చేసిన సహాయం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ విషయంలో సందేహాలు నెలకొనగా ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంది.

కల్కి 2898 ఏడీ ఎక్కువ సంఖ్యలో భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. నాగ్ అశ్విన్  (Nag Ashwin) ఈ సినిమాను ఎలా తెరకెక్కించారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కల్కి మూవీ పాన్ వరల్డ్ రేంజ్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus