Prabhas: ‘కల్కి..’ 22 నిమిషాల తర్వాతే ప్రభాస్ ఎంట్రీ?

  • June 26, 2024 / 10:12 PM IST

మరికొన్ని గంటల్లో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమాని టీం పెద్దగా ప్రమోట్ చేయలేదు. జీరో బజ్ ఉంది కదా అని భావించి ఎక్కువగా నార్త్ లోనే ప్రమోట్ చేశారు. తెలుగులో ప్రమోట్ చేద్దాం అని భావించిన టైంలో ఫైనల్ కాపీ సబ్మిట్ చేయడం వంటి పనుల వల్ల.. ఎటువంటి ప్రమోషనల్ ఈవెంట్లు పెట్టలేదు. అయితే నామ మాత్రంగా కొద్దిసేపటి క్రితం ప్రభాస్ (Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) .లు ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అనేక విషయాల గురించి ముచ్చట్లు పెట్టారు. ‘కల్కి 2898 ad ‘ మైథలాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ టిపికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అందుకే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడానికి అనుకుంట.. వీరిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ చేశారు. అందులో భాగంగా.. ‘కల్కి 2898 ad ‘ లో ప్రభాస్ ఎంట్రీ 22 నిమిషాల వరకు ఉండదట. అంటే మొదటి నుండి కథలోకి జనాలను తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్న మాట.

 

ముందుగా అమితాబ్ (Amitabh Bachchan) ఎంట్రీనే ఉంటుందని తెలుస్తుంది. సినిమా రన్ టైం 3 గంటలు వచ్చింది. ఈ క్రమంలో మొదటి 20 నిమిషాలు ప్రభాస్ కనిపించడు అని తెలుస్తుంది. అంతేకాదు సినిమా మొత్తంలో ప్రభాస్ పాత్ర గంటన్నర మాత్రమే ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది. దానిపై మాత్రం వీరు క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క దీనికి 2 వ పార్టు ఉంటుందని మాత్రం ప్రభాస్ లీక్ చేయడం జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus