Prabhs: ప్రభాస్‌ ఫ్యాన్‌ వీడియో వైరల్‌… ‘ఆదిపురుష్‌’ కోసం టోక్యో నుండి సింగపూర్‌కి!

సినిమా అభిమానం, సినిమా వాళ్లంటే అభిమానం.. వీటి ముందు ఏ బంధమూ నిలవదు అంటుంటారు. కాస్త ఎగ్జాగరేషన్‌లా కనిపించినా మేం చెప్పింది నిజమే. హీరోలకు కోసం వందల కిలో మీటర్లు సైకిల్‌ తొక్కి, నడిచి, బైక్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చిన వాళ్లను చూశాం. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్లు మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఉన్నారు. తమ దేశంలో సినిమా స్క్రీనింగ్‌ లేకపోవడంతో ఎలాగైనా చూడటం కోసం దేశాలు దాటి వచ్చిన వాళ్లు ఉన్నారు.

మొన్నామధ్య షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ కోసం ఇలా జరిగితే.. ఇప్పుడు (Prabhs) ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ కోసం జరిగింది. ఈసారి ఓ అభిమాని జపాన్‌ నుండి సింగపూర్‌ వచ్చి మరీ సినిమా చూసింది. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తమ దేశంలో ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదల కాకపోవడంతో.. టోక్యో నుండి సింగపూర్‌ చేరుకుని అక్కడ సినిమా చూశారు నోరికో అనే మహిళా అభిమాని. అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.

ఓం రౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ సినిమా జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, లంకేశ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. సినిమా వసూళ్లు తొలి రోజుల్లో భారీగా ఉన్నా.. నాలుగో రోజు నుండి పడిపోయాయి. అయితే విమర్శలు, చర్చలు, వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా సినిమా అయితే రూ. 400 కోట్లకుపైగా వసూలు చేసింది.

‘ఆదిపురుష్’ సినిమా కోసం ఆమె సింగపూర్‌ వచ్చాకన్న తెలుసుకున్న అక్కడున్న అభిమాని ఒకరు ఆమెతో మాట్లాడించి వీడియో చిత్రీకరించారు. ‘‘నా పేరు నోరికో, జపాన్ నుండి వచ్చాను. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ ఫ్యాన్‌’’ని అని చెప్పారు. చివర్లో ప్రభాస్ రాముడిగా ఉన్న ఓ ఫొటో చూపించారు’’. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus