Saif Ali Khan: ఆదిపురుష్ తెలుగు సినిమా కాదంటావా సైఫ్ భాయ్ ?!

సరిగ్గా పదిరోజుల్లో విడుదలకానున్న “దేవర” (Devara) ప్రమోషన్స్ మంచి హడావుడిగా జరుగుతున్నాయి. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలకానున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల సందీప్ రెడ్డి వంగా హోస్ట్ గా ఎన్టీఆర్  (Jr NTR)  , జాన్వీకపూర్ (Janhvi Kapoor)  , సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) , కొరటాల శివలతో (Koratala Siva)  కలిసి చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఆ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

Saif Ali Khan

అదేంటంటే.. సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) సినిమాలో హీరోయిన్ అయిన జాన్వీకపూర్ ను “ఇది నీ మొదటి తెలుగు సినిమా కదా?” అని ప్రశ్నించగా.. ఆమె అవును అని చెబుతున్నప్పుడు సైఫ్ కలగజేసుకుని “నాకు కూడా ఇదే మొదటి తెలుగు సినిమా” అని చెప్పాడు. దాంతో “ఆదిపురుష్” (Adipurush) తెలుగు సినిమా కూడా అని మండిపడుతున్నారు ప్రభాస్  (Prabhas)  ఫ్యాన్స్.

నిజానికి “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ క్యారెక్టర్ కు విపరీతమైన నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. అతడు పోషించిన రావణాసరుడు పాత్రను తెగ తిట్టుకున్నారు. అందుకేనేమో.. సైఫ్ అలీఖాన్ “ఆదిపురుష్”ను తన తెలుగు డెబ్యూగా కనీసం కన్సిడర్ చేయలేదు. ఇందుకుగాను ప్రభాస్ అభిమానులేమో సైఫ్ ను తిట్టిపోస్తుండగా, మీమర్స్ మాత్రం సదరు వీడియోతో రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

ఇకపోతే.. సైఫ్ “దేవర” సినిమాలో రెగ్యులర్ విలన్ లా తన్నులు తినడం, చచ్చిపోవడమే కాకుండా మంచి డెప్త్ ఉన్న నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడని, సినిమా రిలీజయ్యాక అతడి పాత్రను ఎన్టీఆర్ తో సమానంగా మెచ్చుకుంటారని దర్శకుడు కొరటాల శివ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. సో, సైఫ్ క్యారెక్టర్ ఎంతలా పండిందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే!

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus