Prabhas: ‘పఠాన్‌’ సినిమా డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు చాలా ఆనందాన్నిస్తోందట..

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. ఆ సినిమాల తర్వాత వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లే చేస్తూ వస్తున్నాడు. అయితే ఆ స్థాయి విజయం అయితే అందుకోవడం లేదు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి ఎక్కడో చిన్న వెలితి. సరైన సినిమా పడాలి, పాన్‌ ఇండియా స్థాయిలో ఉండాలి, ఎలివేషన్లు అద్భుతంగా ఉండాలి అని. అయితే ‘సలార్‌’ సినిమా వాటన్నింటికి సమాధానం ఇస్తుంది. అయితే ఇక్కడే ఇంకో సమస్య ఉంది. బాలీవుడ్‌ దర్శకుడు ప్రభాస్‌కు సరైన విజయం ఇవ్వాలి అని.

‘ఆదిపురుష్‌’ సినిమాతో అది సాధ్యమవుతుంది అని అనుకుంటే.. దర్శకుడు ఓం రౌత్‌ ఏమో బొమ్మల సినిమా తీశారు అని ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. సినిమా టీజర్‌ చూస్తే అలానే అనిపించింది మరి. దీంతో ఇక ఫ్యాన్స్‌ నెక్స్ట్‌ చూపు సిద్ధార్థ్‌ ఆనంద్‌ మీదే పడింది. ఎందుకంటే మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రభాస్‌ – సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారని సమాచారం. అయితే ఆ సినిమా ఎప్పుడు అనేది తెలియదు.

కానీ ఇప్పుడు ‘పఠాన్‌’ సినిమా చూశాక ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. ఈ సినిమా కూడా వేగంగా స్టార్ట్‌ అయితే బాగుండు అంటున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమాలు ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘వార్‌’ చూస్తే.. వావ్‌ అనిపిస్తాయి. కథ, కథనం విషయంలో కాస్త డౌన్‌ ఉన్నా ఎలివేషన్లు, యాక్షన్‌ సీన్ల విషయంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. అంతగా అదరగొట్టేస్తారు. ఇప్పుడు ‘పఠాన్‌’లో వాటితోపటు మిగిలిన అంశాలు కూడా బాగున్నాయి. దీంతో ప్రభాస్‌ – సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమా రావాల్సిందే..

అది కూడా వేగంగా అంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఇది కూడా యశ్‌రాజ్‌ స్పై సిరీస్‌లోనే ఉంటుందటంటున్నారు. అదేంటి మైత్రీ మూవీ మేకర్స్‌ అన్నారు కదా అనుకుంటున్నారా? అయితే ఇక్కడే చిన్న యాడ్‌ అన్‌ వచ్చిందని టాక్‌. యశ్‌రాజ్‌, మైత్రీ వాళ్లు కలసి ఈ సినిమా చేస్తారు అని లేటెస్ట్‌ రూమర్స్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ ప్రభాస్‌ సినిమాకు వస్తారు అని సమాచారం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus