Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న రాధేశ్యామ్!

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రభాస్ తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. దేశంలోనే టాలెంట్ ఉన్న అతి కొద్దిమంది పాన్ ఇండియా హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. అయితే బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత వచ్చిన క్రేజ్ ను సరైన విధంగా వినియోగించుకోవడంతో ప్రభాస్ ఫెయిల్ అవుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కు మాస్ ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే ప్రేక్షకుల అభిరుచికి తగిన కథలను ప్రభాస్ ఎంచుకోవడంలో ప్రభాస్ విఫలవుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ గత సినిమా సాహో హాలీవుడ్ తరహా కథాంశంతో తెరకెక్కినా మాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. మరోవైపు తన శైలికి భిన్నమైన కథ అయిన రాధేశ్యామ్ లో ప్రభాస్ నటించారు. ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు కావడం గమనార్హం.

రాధేశ్యామ్ టీజర్ లో ప్రభాస్ ఇంగ్లీష్ డైలాగ్ చెప్పగా ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నా రాధేశ్యామ్ కూడా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల్లో ఈ టీజర్ కొంచెం టెన్షన్ పుట్టించిందనే చెప్పాలి. విజువల్స్ బాగున్నాయని టీజర్ టాప్ క్లాస్ అని కొంతమంది అభిప్రాయపడుతుండగా మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ప్రయోగాల కంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus