Prabhas: రాజమౌళి డైరెక్షన్ లో మళ్లీ నటించాలని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో ఛత్రపతి (Chatrapathi)  , బాహుబలి1 (Baahubali: The Beginning) , బాహుబలి2 (Baahubali 2: The Conclusion) సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలు విడుదలై చాలా సంవత్సరాలు అయినా ప్రేక్షకులకు అస్సలు బోరు కొట్టని సినిమాలుగా ఈ సినిమాలకు పేరుంది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ చాలా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు బాహుబలి2 సినిమాకు దరిదాపుల్లో కూడా లేవని చాలామంది భావిస్తారు. ప్రభాస్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ లో మరో భారీ ప్రాజెక్ట్ ను కోరుకుంటున్నామని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) సినిమా పూర్తైన వెంటనే ఈ కాంబోలో సినిమా కోరుకుంటున్నామని అభిమానులు చెబుతున్నారు. బాహుబలి3 తెరకెక్కించినా పరవాలేదని లేదా మరో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కించినా పరవాలేదని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. ప్రభాస్ జక్కన్న కాంబో బెస్ట్ కాంబో అని సినీ అభిమానులు సైతం చెబుతున్నారు. రాజమౌళి అడిగితే ప్రభాస్ ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా వెంటనే డేట్స్ కేటాయించే అవకాశాలు అయితే ఉంటాయి.

మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. మహేశ్ రాజమౌళి కాంబో మూవీ విడుదల కావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందేనని సమాచారం అందుతుండటం గమనార్హం. ఈ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా సైతం రికార్డులు క్రియేట్ చేస్తుండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు వరుస విజయాలు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు ప్రభాస్ ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus