ముగ్గురు హీరోయిన్స్ నే ఫాలో అవుతున్న ప్రభాస్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేం రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్నాడు. మరో పక్క ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఇదిలా ఉండగా.. అనుష్క, ప్రభాస్ ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి అందరిక తెలిసిందే. ఈ మధ్యనే ‘ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ మానేస్తావా? సినిమాలు మానేస్తావా?’ అని అడిగితే ‘సినిమాలే మానేస్తాను’ అని చెప్పింది అనుష్క.

దానిని బట్టి అనుష్క.. ప్రభాస్ కు ఎంత విలువ ఇస్తుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ మాత్రం అనుష్కకు దూరంగా ఉంటున్నాడు అని ప్రచారం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అనే టాక్ కూడా రన్ అవుతుంది! అసలు ఈ ప్రచారానికి కారణం.. ప్రభాస్ తన ఇన్స్టా గ్రామ్ ఎకౌంట్లో అనుష్క ను ఫాలో కాకుండా ఉండడం వల్లనే అని తెలుస్తుంది. ప్రభాస్.. కేవలం 5 గురినే ఫాలో అవుతున్నాడు.

అందులో ఒకరు ‘సాహో’ దర్శకుడు సుజీత్, నటి భాగ్యశ్రీ.. కాగా మిగతా ముగ్గురు హీరోయిన్లు కావడం విశేషం. అందులో ‘సాహో’ హీరోయిన్ శ్రద్దా కపూర్.. అలాగే ‘రాధే శ్యామ్’ హీరోయిన్ పూజా హెగ్డే.. ‘ప్రభాస్21’ హీరోయిన్ దీపికా పడుకొనే మాత్రమే ఉండడం గమనార్హం. గతేడాదే ఇన్స్టా గ్రామ్ లోకి ప్రభాస్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అనుష్క ను మాత్రం ప్రభాస్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు అనే విషయం పైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus