Prabhas,Nag Ashwin: ‘ప్రాజెక్ట్‌ K’ కోసం ప్రభాస్‌ ఏం చేశాడంటే..!

టాలీవుడ్‌లో ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ సాగిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘బాహుబలి’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రరాజానికి హీరోలు ప్రభాస్‌, రానాతోపాటు చాలామంది నటులు వందల రోజుల కాల్‌షీట్స్‌ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాస్‌ రెండు పార్టులు విడుదలయ్యేంత వరకు వేరే సినిమాకు కాల్‌షీట్లు ఇవ్వలేదు. అలా ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక రోజులు ఓ సినిమా కోసం పని చేశాడు అంటే… అది ‘బాహుబలి’నే. అయితే ఇప్పుడు ఆతర్వాత హయ్యస్ట్‌ కాల్‌షీట్లు ఓ సినిమాకు ఇస్తున్నాడట.

ఒకప్పుడు ప్రభాస్‌ వరుస సినిమా చేసేవాడు కానీ… ఇప్పుడు చేసేంత కాదు. పాన్‌ ఇండియా హీరోగా ఇమేజ్‌ వచ్చాక ప్రభాస్‌ సినిమాల లైనప్‌ స్ట్రాంగ్‌ అవుతా వస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్‌ సినిమా డేట్స్‌ కేటాయించడం చాలా కష్టం ఉంది. దొరికినప్పుడు సీన్లు తీసేద్దాం అనుకుంటున్నారు దర్శకులు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్‌ ఓ సినిమా కోసం ఏకంగా 200 రోజులు కాల్‌షీట్లు కేటాయించాడంటున్నారు. అవును అది కూడా మన సినిమానే.

నాగ్‌ అశ్విన్‌ దర్శకుడుగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) కోసమే ఈ 200 రోజుల కాల్‌షీట్స్‌ అంట. వైజయంతీ మూవీస్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు ఇందులో నటిస్తున్నారు. దీంతో షూటింగ్‌ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా… గంపగుత్తగా అన్ని కాల్షీట్లు ఇస్తున్నాడట. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందంటున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ఎప్పుడు మొదలు అనే విషయంలో త్వరలో స్ఫష్టత వస్తుందంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus